వైఎస్ జగన్ ను రోడ్డున పడేసిన కాంగ్రెస్: గాలి జనార్ధన్ రెడ్డి

రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన కొడుకు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని కాంగ్రెప్ పార్టీ రోడ్డుపై పడ వేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఓ వ్యక్తి కుటుంబానికి కాంగ్రెస్ లో ఇచ్చే గౌరవం ఇదని ఆయన అన్నారు. ఎంతో ప్రజాభీమానాన్ని కూడగట్టుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబానికి విలువ ఇవ్వక పోవటం ద్వారా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ కున్న నమ్మకం ఏపాటిదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో సంక్షోభం సోమవారంతో తెరపడుతుందని ఆయన అన్నారు. సోమవారం జరిగే అవిశ్వాస తీర్మానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఖచ్చితంగా నెగ్గుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు తమకు రెబెల్ ఎమ్మెల్యేలు సహకరించకున్నా ఫరవాలేదని, వారు లేకుండానే మేము అవిశ్వాశ తీర్మాన గండం దాటుతామన్నారు.
ఒకవేళ యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు కర్ణాటకలో ఏర్పడుతాయన్నారు. కాని ప్రభుత్వం పూర్తిగా పడిపోయే అవకాశాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications