గద్దర్ తెలంగాణ ఫ్రజా ఫ్రంట్ లో విభేదాలు, ఎన్నికల చిచ్చు

Gaddar
హైదరాబాద్: ఎన్నికల్లో పాల్గొనే విషయాన్ని పక్కన పెట్టడంతో తెలంగాణ ప్రజా ఫ్రంట్‌లో విభేదాలు పొడసూపాయి. ఎన్నికల్లో పాల్గొనాలనే ఓ వర్గం తీవ్ర వాగ్వివాదానికి దిగి సమావేశం నుంచి వెళ్లిపోయింది. రాజ్యాంగబద్ధమైన పోరాటమే ఫ్రంట్ కార్యాచరణ అయినప్పుడు, అందులో భాగమైన ఎన్నికలను ఎందుకు స్వీకరించరని కొన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు గట్టి వాదించారు. ఎన్నికల అంశంపై చర్చ చేయకూడదని ముసాయిదాలో షరతు విధించడంపై ప్రజాసంఘాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. తొలుత తెలంగాణ రైతాంగ వేదిక కన్వీనర్ జానకిరాం రెడ్డి ప్రత్యేక ముసాయిదాను ప్రతిపాదించే ప్రయత్నం చేశారు. దీన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేకించారు.

ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, టి.హనుమాండ్లు, ఎస్.వెంకటస్వామి, వినోద్‌కుమార్ తదితరులు గద్దర్‌కు, స్టీరింగ్ కమిటీకి లేఖ రాశారు. ఎన్నికలను కూడా ఒక పోరాట రూపంగా గుర్తించాలని వారు ప్రతిపాదించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు బండ్రు విమల ముసాయిదాలో చేర్చాల్సిన అదనపు అంశాలను ప్రతిపాదించారు. ఎన్నికలను ఓ పోరాటంగా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. తీర్మానాలను చదివే సమయంలో గద్దర్ ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. ఎన్నికల పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి చర్చిద్దాం అని ఆయన ప్రకటించడంతో ఫ్రంట్ ఎన్నికలకు వెళ్తుందనే సందేశం బయటకు వచ్చింది. దీంతో కొందరు జేఏసీ సభ్యులు ఎన్నికలు వద్దని గట్టిగా నినాదాలు చేశారు. చివరకు విమల మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు విద్యార్థులు అడ్డుకున్నారు. రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, ఫ్రంట్‌లో కొనసాగబోమని ఎన్నికలను ఓ పోరాట రూపంగా గుర్తించాలనే హనుమాండ్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+