హైదరాబాద్ లో అర్ధరాత్రి యువకుల వీరంగం: ఇద్దరికి తీవ్ర గాయాలు
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధాని నగరంలోని హైదరాబాద్‌లోని రహీంపురాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు వర్గాలకు చెందిన వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని రహీంపురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు యువకులు ఆ ప్రాంతమంతా కలిజ తిరుగుతూ వీరంగం సృష్టించారు. అడ్డుకున్న కొందరిపై దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకున్న వారిపై దాడికి దిగారు. దీంతో అడ్డుకున్న వారూ రెచ్చిపోయారు. అరగంటపాటు ఇరువర్గాలు ఒకరిమీద ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. ఆ దాడిలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే దగ్గరలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలో బలగాలను మోహరించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పరిస్థితి అదుపులో ఉంచారు.