కెసిఆర్ ది దొంగ దీక్ష, ఆధారాలున్నాయి : గోనే

కెసిఆర్ తెలంగాణ వాదాన్ని కేవలం డబ్బు సంపాదన కోసమే ఎత్తుకున్నాడని, గత నవంబర్లో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష అంతా వట్టిదేనని ఆయన దొంగ దీక్ష చేశాడన్నారు. ఆయనది దొంగ దీక్ష అనడానికి ప్రభుత్వం వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం బయట పెట్టకుంటే రోశయ్యకు కెసిఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తుందని ఆయన అన్నారు.
కెసిఆర్ ను మళ్లీ దీక్ష అనడానికి ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ పెట్టిన ప్రజా ఫ్రంట్ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పై తను చేసిన వ్యాఖ్యలు అన్నీ నిరూపించడానికి తాను సిద్ధమన్నారు. కెసిఆర్ తీరుపై తాను రాష్ట్ర్రంలో ఎక్కడైనా చర్చించడానికి సిద్ధమన్నారు. ప్రజల్లోకి వెళదామా అంటూ కెసిఆర్ కు సవాలు విసిరారు.












Click it and Unblock the Notifications