కెసిఆర్, గద్దర్ లకు కాంగ్రెసు తెలంగాణ నేత కేశవరావు సలహాలు

kk and kcr
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు కె. కేశవరావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ కు సలహాలు ఇచ్చారు. ఇతర పార్టీలను విమర్శించడం గద్దర్, కెసిఆర్ మానుకోవాలని ఆయన సూచించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగే తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభకు ఆదివారం హైదారాబాదు నుంచి బయలుదేరే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు ఎవరు ద్రోహం, అన్యాయం చేశారనేది ఇప్పుడు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యమని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం ఉద్యమించేవారంతా తమ మిత్రులేనని ఆయన అన్నారు. దారులు వేరైనా చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటేనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోగతాన్ని తాము ఎప్పటికప్పుడు తమ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నవారంతా పరస్పరం విమర్శించుకోవడం వల్ల ఇతరులు లాభపడుతారని ఆయన అన్నారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు గద్దర్ పక్కన కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+