గద్దర్ వెనుక వేరే శక్తులు ఉన్నాయి: అరుణోదయ విమలక్క

తెలంగాణ ప్రజా ఫ్రంట్ సమావేశంలో ప్రంట్ అనుకూలురైన వారితోనే మాట్లాడించారని ఆమె ఆరోపించారు. ఫ్రంట్ సమావేశం ఏకపక్షంగా జరిగిందన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలనుకోవటం ఎన్నికలను సమర్ధించటమే అవుతుందని అన్నారు. మేము ఎన్నికలకు, ఉద్యమాన్ని వేరుగా చూస్తామని ఆమె చెప్పారు. మమ్మల్లి ఎన్నికలు కోరుకునే వారిగా చిత్రీకరించడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఎప్పుడూ ఎన్నికలకు దూరమేనని ఆమె చెప్పారు. అయితే తెలంగాణ కోసం అందరినీ కలుపుకొనిపోవాలని మాత్రమే తాము చెప్పామని అమె అన్నారు.












Click it and Unblock the Notifications