పిసిసి షోకాజ్ నోటీసు: సోనియా గాంధీకి రాయపాటి సాంబశివ రావు లేఖ

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని బాగుచేమని కోరుతూ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయపాటి సాంబశివరావు ఆ లేఖ రాశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా దిగజారిపోయిందని, మీరు జోక్యం చేసుకొని చక్కదిద్దాలని ఆ లేఖలో కోరారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కె.రోశయ్యకు కూడా రాయపాటి పంపారు. మంత్రి వర్గంలో అవినీతిపరులు ఉన్నారని, వారిని తొలగించి ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. చేపట్టాల్సింది మంత్రి వర్గ విస్తరణ కాదని, ప్రక్షాళన అని ఆయన అన్నారు. మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications