మంత్రివర్గాన్ని విస్తరించు, లేదంటే దిగిపో: రోశయ్యతో రాయపాటి

ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రోశయ్యకు మంచి పేరు ఉందని, ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇప్పటి వరకూ అనుభవంతో రోశయ్య నెట్టుకొస్తున్నారని, ఇప్పుడు అధిష్ఠానం కూడా ఆయనకు సహకరించాలని ఆయన అన్నారు. ఇప్పుడు గట్టి చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమేనని, 2014లో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, ఇందుకు తక్షణమే మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. అవినీతి మంత్రులను తొలగించడం మంచిదని ఇందుకు ముఖ్యమంత్రి రోశయ్య కూడా అధిష్ఠానం వద్ద గట్టిగా మాట్లాడాలని ఆయన అన్నారు. అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోతే నా వల్ల కాదని చెప్పి రాజీనామా చేసి వైదొలగడం మంచిదని రాయపాటి సూచించారు.












Click it and Unblock the Notifications