రాజీనామా చేసి జగన్ మద్దతివ్వండి: నల్లపురెడ్డికి టిఎన్ఎస్ఎఫ్ ఆల్టిమేటం

తెలుగు దేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. జగన్ కు, నల్లపురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లపురెడ్డి జగన్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే వెంటనే తెలుగు దేశం పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మద్దతునిచ్చుకోవచ్చునని సూచించారు. మద్దతు ఉపసంహరించుకోవటమా లేక రాజీనామా చేయటమా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆంతకుముందు. సోమవారం నల్లపురెడ్డి జగన్ ఓదార్పు యాత్రను సమర్థించిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలకు ఓదార్పు పేరుతో జగన్ సహాయం చేయటం మంచి పరిణామమని, పార్టీలకతీతంగా జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర నెల్లూరులో ఉన్నప్పుడు తానూ పాల్గొంటానని ఆయన చెప్పాడు.












Click it and Unblock the Notifications