వైయస్ జగన్ అపర కుబేరుడు: అడ్వాన్స్ ట్యాక్సే రూ.84 కోట్లు

ఆయన వార్షికాదాయమే 520 కోట్ల రూపాయలు ఉందంటే ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయనకు ప్రధాన ఆదాయ వనరు గనుల తవ్వకాలే. ఆయన ఆదాయంలో గాలి సోదరులను మించిపోయారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మీఅరుణ 7 కోట్ల రూపాయలు తొలి ఆరు నెలలకు గాను అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు వస్తాయనే ముందు చూపుతోనే వైయస్ జగన్ ఆ పన్ను చెల్లించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications