హైదరాబాద్: ఓ బాలికపై ఆత్యాచారయత్నానికి ప్రయత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదన్నపేట మాజీ సర్కిల్ ఇన్స్ పెక్టర్ రంగస్వామి రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్ కోర్టులో లొంగిపోయాడు. మాదన్నపేట సిఐగా చేసిన సమయంలో మైనర్ బాలికపై ఆత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అయన కనిపించకుండా పోయాడు. మళ్లీ గురువారం కోర్టుకు వచ్చి లొంగిపోయాడు. ఈ అత్యాచారం కేసులోనే అతను సస్పెండ్ అయ్యాడు.