వైయస్ జగన్ ఓదార్పు యాత్ర నేతల మధ్య పెట్టిన చిచ్చు

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నెల్లూరు జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర నెల్లూరు జిల్లా కాంగ్రెసు నాయకులు మధ్య చిచ్చు రేపింది. కాంగ్రెసు నాయకులు రెండుగా చీలిపోయి పరస్పరం విమర్సలు చేసుకుంటున్నారు. ఓదార్పు యాత్రలో పాల్గొనడం, పాల్గొనకపోవడంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ యాత్రలో తాము పాల్గొనడం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు ఇప్పటికే స్పష్టం చేశారు. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి కూడా ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదు. ఒక వర్గం మాత్రం నేదురుమల్లి, ఆదాల ప్రభాకరరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓదార్పు యాత్రలో నేదురుమల్లి, ఆదాల ప్రభాకర రెడ్డి నేరుగా పాల్గొనకపోయినా, వారి వర్గీయులు పాల్గొంటున్నారని మరో వర్గం పేర్కొంటోంది. డీసీసీ అధ్యక్షుడు గోపాలరెడ్డి ఓదార్పుయాత్రలో పాల్గొనాలని మరోసారి పిలుపును ఇచ్చినా పీసీసీ స్పందించకపోవడం పట్ల మరొక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తాను బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా అధిష్ఠానం నిర్ణయం మేరకు కడప ఎంపీ వైఎస్ జగన్ చేపట్టే ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. "మా కుటుంబ సభ్యులెవరూ ఓదార్పులో పాల్గొనరు. కొడుకు అటువైపు.. కూతురు ఇటువైపు పోవడం లాంటివి జరగవు'' అని స్పష్టం చేశారు. పీసీసీ కార్యదర్శి శ్రీధర్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని తాము కోరామనడం హాస్యాస్పదమన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై విరుచుకుపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+