రాష్ట్ర రాజకీయాలు: టిడిపి అధినేత చంద్రబాబు వర్సెస్ వైయస్ జగన్

కాగా, వైయస్ జగన్ తెలుగుదేశం నాయకులపై పెద్దగా ప్రతిస్పందించడం లేదు. రెండు,మూడు సార్లు పరోక్షంగా స్పందించారు. మరణించిన తన తండ్రిపై విమర్శలు చేసే వారు మట్టి కొట్టుకుపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. రాజకీయాలు నీచ స్థాయికి దిగజారాయని ఆయన అన్నారు. ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియడం లేదని, తననే ముఖ్యమంత్రి అనుకుని తనపై విమర్శలు చేస్తోందని ఆయన ఓసారి అన్నారు. జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గోనె ప్రకాశ రావు వంటి నాయకులు మాత్రమే తెలుగుదేశం నాయకుల విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండెకరాల ఆసామి చంద్రబాబు కోట్లాది రూపాయల సంపాదనాపరుడు ఎలా అయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications