హైదరాబాదులో రేపు కవిత కోటి బతుకమ్మల జాతర

అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళలు బతుకమ్మ ఆడుతారని, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారని కవిత చెప్పారు. తెలంగాణకు చెందిన 9 జిల్లాల నుంచి పెద్ద యెత్తున మహిళలు జాతరకు తరలి వస్తారని ఆమె అన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆట సాగుతుంది. తొమ్మిదో రోజు ముగుస్తుంది. తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా కోటి బతుకమ్మల జాతరను కవిత హైదరాబాదులో తలపెట్టారు.












Click it and Unblock the Notifications