చర్యలు ఓదార్పులో పాల్గొన్నందుకు తీసుకోవడం లేదు: జెసి

అనంతపురం: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నందుకే పార్టీ నాయకత్వంపై చర్యలు తీసుకుంటుందనే మాటలో నిజం లేదని సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. వేరే కారణాల వల్ల నాయకులపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రోశయ్యకు సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు.

అనంతపురం జిల్లాలో జరిగేవి రాజకీయ హత్యలు కావాలని, ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. హత్యలతో తెలుగుదేశం పార్టీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ సంబంధం లేదని ఆయన అన్నారు. వ్యక్తిగత కక్షల వల్లనే హత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+