రెచ్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్: ఫర్నీచర్ ధ్వంసం
Districts
oi-Pratapreddy
By Pratap
గుంటూరు: హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గుంటూరు జిల్లా వినుకొండలో రెచ్చిపోయారు. వినుకొండలోని లక్ష్మి థియేటర్ లో విధ్వంసానికి దిగారు. ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమా ప్రదర్శన సందర్భంగా గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమా విడుదలైంది. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు పెద్ద యెత్తున థియేటర్లకు చేరుకున్నారు. ఇద్దరు హీరోయిన్ల సరసన జూనియర్ ఎన్టీఆర్ నటించారు. బృందావనం సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా సరిగా లేదంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ప్రొజెక్టర్ లో నీళ్లు పోశారు.