జూ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు చానెళ్లో సిబ్బందికి ఉద్వాసన

రెండు రోజులుగా వారు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ చుట్టూ తిరుగుతున్నా చంద్రబాబు నుంచి సరైన స్పందన రాలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన వీడియో ఎడిటర్ మారుతి కళ్యాణ్ (28) ఆత్మహత్యా యత్నం చేశాడు. స్టూడియో-ఎన్ యాజమాన్యం చర్యను జర్నలిస్టు సంఘాలు నిరిసించాయి. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 90శాతం మంది తెలంగాణ ప్రాంతానికే చెందినవారని, పక్షపాత ధోరణితోనే యాజమాన్యం ఈ చర్యకు పాల్పడిందని మండిపడ్డాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులు బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ జర్నలిస్టు సంఘాలతో కలిసి చర్చించి తవు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు. గురువారం నుంచి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. విధుల్లోకి తీసుకునేంతవరకు పోరాటం చేయాలని నిర్ణయించారు.
అంతకుముందు బాధిత ఉద్యోగులు తవు యుజవూని నార్నే శ్రీనివాసరావుకు సమీప బంధువైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ భవన్‌లో కలిశారు. తమకు న్యాయం చేయాల్సిందిగా బాబుని కలిసి విన్నవించారు. అయితే చంద్రబాబు నుంచి సానుకూల స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. అది వ్యాపారానికి సంబంధించిన అంశమని ఆయన చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications