బలపరీక్షలో మరోసారి నెగ్గిన కర్ణాటక సిఎం యెడ్యూరప్ప

16 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు ఓటు హక్కు లేకపోవడంతో యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గడం సులభంగా మారింది. 16 మందిపై అనర్వహత వేటు పడడంతో సభలో సభ్యుల సంఖ్య 208 ఉంది. ఇందులో కాంగ్రెసు సభ్యులు 73 మంది కాగా, జెడిఎస్ సభ్యులు 28 మంది. ఓ జెడిఎస్ సభ్యుడొకరు యడ్యూరప్పకు మద్దతు ప్రకటించారు. దీంతో యడ్యూరప్ప విజయం నల్లేరు మీద నడకే అయింది. దీంతో బిజెపి తన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని సిద్ధరామయ్య కోరారు. అయితే ఓటింగులో కాంగ్రెసు పాల్గొన్నది.












Click it and Unblock the Notifications