చంద్రబాబు పుత్రుడు లోకేష్ వ్యూహం: జగన్ సాక్షికి దీటుగా స్టూడియోఎన్

Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ స్టూడియోఎన్ ను పునర్వ్యస్థీకరించే పనిలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ కు దీటుగా స్టూడియోఎన్ ను తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన 70 మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు సమాచారం. సాక్షి టీవీ చానెల్లో, రాజ్ న్యూస్ లో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినా స్టూడియోఎన్ సిఇవో లోకేష్ బెదరడం లేదు. ఉద్వాసనకు వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టులు గురువారం స్టూడియోఎన్ వద్ద ధర్నాకు దిగారు. వారిపై లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీ చేయడమే కాకుండా నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. లోకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిన జర్నలిస్టులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

తన తండ్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్షిలో ఎడ తెగకుండా వ్యతిరేక వార్తాకథనాలు వస్తున్నాయి. దానికి దీటుగా లోకేష్ జగన్ పై వార్తాకథనాల రూపకల్పనకు వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూర్ లోని జగన్ నివాస భవనంపై, జగన్ అస్తులపై వరుసగా వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. అంతకు ముందు స్టూడియో ఎన్ కు పెద్దగా గుర్తింపు లేదు. జగన్ కు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం కావడంతో స్టూడియోఎన్ అందరి నోళ్లలో నానడం మొదలు పెట్టింది. కాంగ్రెసు నాయకులు స్టూడియోఎన్ పై విరుచుకుపడిన సందర్భాలు వచ్చాయి. స్టూడియోఎన్ ను చంద్రబాబు సమీప బంధువు నార్నే శ్రీనివాసరావు స్థాపించారు. దాన్ని సిఇవోగా లోకేష్ తన చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో దాని రూపురేఖలు మార్చేసే అవకాశం చంద్రబాబుకు దక్కిందని అంటున్నారు. చంద్రబాబు త్వరలో ఓ వార్తాపత్రికను కూడా పెట్టనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+