వైభవంగా బతుకమ్మ జాతర: కరుణానిధి కూతురు కనిమొళి హాజరు

జాతర కోసం ప్రత్యేకంగా రూపొందించిన రథాలు ఆకర్షణీయంగాగా నిలిచాయి. కళాకారులు జానపద నృత్యాలతో అలరించారు. చిందు భాగవతులు తమ విన్యాసాలను ముచ్చటగా ప్రదర్శించారు. మేయర్ బండ కార్తీకరెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా నాయకురాలు వనం ఝాన్సీతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తెలంగాణ సాధన కోసం తామంతా కొంగు బిగించి కదులుతామని అన్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్‌లో తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా ఏర్పాటు చేసిన ఆహారోత్సవాన్ని, చిత్ర ప్రదర్శనను కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి శుక్రవారం తిలకించారు. ఇవి ఎంతో బాగున్నాయని ఆమె కితాబిచ్చారు. తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా నిర్మల్ బొమ్మలు, పట్టు చీరలను ఆమెకు అందజేశారు. కోటి బతుకమ్మల పండుగ నిర్వహించటం అభినందనీయమని మేయర్ కార్తీకరెడ్డి అన్నారు. మేయర్, కవిత కలిసి పదకొండు రకాల పూలతో బతుకమ్మలను తయారు చేశారు.












Click it and Unblock the Notifications