కొడుకు లోకేష్ చానెల్ ఉద్వాసనలు: మీడియాపై చంద్రబాబు చిర్రుబుర్రు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న స్టూడియోఎన్ బాధిత ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత జర్నలిస్టులు ట్రస్గ్ భవన్ వద్ద బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరుగుతుందని తెలిసి, వినతి పత్రం ఇవ్వడానికి వస్తే తమని అరెస్ట్ చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల ఆత్మహత్యలపై ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ బాధలు పట్టించుకోవడంలేదన్నారు. ఏ కారణం చూపకుండా స్టూడియోఎన్ ఉద్యోగులను రేపటి నుంచి రావద్దని చెప్పి తొలగించారని చెప్పారు. సమయం కూడా ఇవ్వకుండా ఇలా తొలగిస్తే ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఒక జర్నలిస్ట్ నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తెలిపారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. తొలగించినవారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications