అన్న కెటి రామారావుకు సవాల్ విసిరిన కెసిఆర్ కూతురు కవిత

తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పాట ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి తెలంగాణ మహిళలను సమీకృతం చేయడంలో ఆమె విజయం సాధించారనే చెప్పాలి. మహిళా రాజకీయ శక్తిని సమీకరించే పనిలో ఆమె చాలా వరకు సఫలమయ్యారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో ఆమెకు సంబంధం లేదు. తన అన్న కెటి రామారావు పార్టీలో ఉండడంతో ఆమెకు పార్టీలో చోటు దక్కలేదు. అంతేకాకుండా, గత ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలనే ప్రయత్నం కూడా ఫలించలేదు. ఈసారి, ఆమెను కాదనే పరిస్థితి కెసిఆర్ కు గానీ, కెటి రామారావుకు గానీ ఉండకపోవచ్చు. ఆమె రాజకీయ జీవితాన్ని అడ్డుకోవడానికి కెటి రామారావు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. బతుకమ్మ జాతర నిర్వహణ ద్వారా కవిత తన అన్నకు సవాల్ విసిరారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications