హైదరాబాద్ లో భారీ దొంగతనం: 30 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీ
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఆదివారం భారీ దొంగతనం జరిగింది. నగరంలోని సుమిత్రానగర్ లోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, 2 కిలోల వెండిని దోచుకెళ్లారు. పోలీసులు కేసు బుక్ చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా ఇళ్లలో ఎవరూ లేని సమయంలో వారు ఊరికి వెళ్లిన సమయాన్ని చూసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నగరంలోని పలుచోట్ల భారీ దొంగతనాలు జరిగాయి. వాటిలో కొన్నింటిని పోలీసులు ఛేదించారు. ఇటీవల ఓ జువెల్లరీ దుకాణంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ఆ దొంగతనం ఆ దుకాణంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులే చేసిన విషయం తెలిసిందే.