ఎన్టీఆర్ భవన్లోకి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి....

గత శాసన సభ ఎన్నికల్లో చిరంజీవి, జయప్రకాశ్ నారాయణలు పార్టీ పెట్టడం వల్లనే చంద్రబాబు పలుమార్లు చెప్పారు. తెలుగు దేశం నాయకులు పలు సందర్భాల్లో కాంగ్రెస్ ను ఇలాగే విమర్శిస్తారు. చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ కూడా లోలోన కాంగ్రెస్ దగ్గరి వారే అన్న ఆరోపణలు వినిపించాయి. అందుకు అవున్నట్టుగా చిరంజీవి ఇటీవల కాలంలో రోశయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు వస్తే ఆదుకుంటామని చెప్పడం, వైఎస్ జగన్ ను ధీటుగా ఎదుర్కోవడానికా అన్నట్టు ఆ మధ్య ఏఐసిసి ఆధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రావటం, ప్రజారాజ్యం త్వరలో కాంగ్రెస్ లో విలీనం అవుతుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడడానికి తెలుగు దేశం పార్టీతో కలిసి రావడమన్నది ఎవరూ ఊహించలేని విషయం. అయితే ఇది వ్యూహాత్మకం కాదని అనలేము. ఏమైతేనేం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మొత్తానికి ఎన్టీఆర్ భవన్లో అడుగు పెట్టింది.












Click it and Unblock the Notifications