ఇంజనీరింగ్ విద్యార్ధినిని అదృశ్యం: కానిస్టేబుల్ పై అనుమానం
Districts
oi-Srinivas G
By Srinivas
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు సెయింట్ జాన్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న రవి తేజస్విని అనే అమ్మాయి ఆదివారం కనిపించకుండాపోయింది. రవి తేజస్విని తల్లిదండ్రులు నంద్యాల వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న శివశంకర్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుండి స్పందన లేదు. వారు ఫిర్యాదును కూడా స్వీకరించక పోవటం గమనార్హం.