కర్ర యుద్ధానికి దేవరగట్టు సిద్ధం: ఆందోళనలో పోలీసులు

కర్రలతో కొట్టుకొని దేవుడిని దక్కించుకోవటం తాము ఇప్పుడు చేస్తున్నది కాదని, తమకు ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోందని చెబుతున్నారు. కర్ర యుద్ధాన్ని ఆపడానికి పలువురు ఉద్యమాలు చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఆ మూడు గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినప్పటికీ వారు తమ సంప్రదాయాన్ని మానుకునేది లేదంటి చెప్పుతున్నారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కనీసం కొట్టుకోవడానికి వాడే కర్రలకు ఇనుప వస్తువులు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోక పోవటంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో అక్కడ పోలీసులను మోహరిస్తోంది. వారు కొట్టుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేయటం, కర్రలతో యుద్ధానికి దిగినప్పుడు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించటం చేస్తున్నారు. అంతేకాని ఆయా ప్రజలకు ఇప్పటి వరకు చైతన్యం చేయలేకపోయారు. అందుకే అక్కడి పోలీసులకు దసరా వచ్చిందంటే దేవరగట్టు భయం పట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈసారీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం జరిగే దేవరగట్టు ఉత్సవానికి భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లారు.












Click it and Unblock the Notifications