బెజవాడ పొలిటిక్స్: వంశీని కాదని నెహ్రూకు ఉమా సపోర్టు

Vallabhaneni Vamsi
విజయవాడ: బెజవాడ తెలుగు దేశంలో విభేదాలు రచ్చకెక్కుతున్నప్పటికీ అధిష్టానం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. విజయవాడకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు వల్లభనేని వంశీ, దేవినేని ఉమా మహేశ్వర రావు నిరంతరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒకరిమీద ఒకరు విరుచుకు పడుతున్నారు. దేవినేని ఉమ స్థానిక కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూతో కలిసి తనను రాజకీయంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే వంశీ కొద్దీరోజులుగా విజయవాడలో ఉండటం లేదు. దీంతో బెజవాడ వంశీ వర్గీయుల్లో తీవ్ర నిరాసక్తత నెలకొంది. అయితే ఇటీవల దినేష్ అనే తెలుగు దేశం యువనేతను కొందరు తీవ్రంగా కొట్టారు. అప్పటి వరకు విజయవాడ పార్టీ విషయాల్ని పట్టించుకోని వంశీ దినేష్ మీద దాడి వెనుక స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు హస్తం ఉందంటున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ఉమ కాంగ్రెస్ వారితో కుమ్మక్కయి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

బెజవాడలోని వంశీ వర్గీయులు సైతం ఉమ కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూతో కలిసి వంశీని దెబ్బ తీయాలని చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధిష్టానం కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీనివాస్ హత్యలో వంశీకి సంబంధం లేకున్నా వంశీని రాజకీయంగా దెబ్బతీయడానికి ఉమ ఆ హత్యలో వంశీని ఇరికించాలని చూస్తున్నారంటున్నారు. గత కొంత కాలంగా వల్లభనేని వంశీ, దేవినేని నెహ్రూలకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు కూడా జోక్యం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+