తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మంత్రి గీతారెడ్డి కౌంటర్

ప్రధానిని ఏమైనా అంటే సమాజం చీపురుకట్టలు పట్టుకుని కొడుతుందని ఆమె హెచ్చరించారు. ప్రధానిపై విమర్శలు చేస్తే సహించబోమని ఆమె అన్నారు. కుళ్లు రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు నిదర్శమని ఆమె అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన మన్మోహన్ ను ప్రశంసించకపోయినా ఫరవాలేదని, విమర్శలు మాత్రం చేయవద్దని ఆమె సూచించారు. పార్టీలు మార్చే సంస్కృతి ముద్దుకృష్ణమనాయుడిదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications