రాష్ట్ర భౌగోళిక విభజన మాత్రమే కోరారు, ప్రజల విభజన కాదు: లగడపాటి

కాంగ్రెసు నాయకుల మాటల్లో వ్యత్యాసం ఉన్నా అందరం సోనియా బాటలోనే నడుస్తామని ఆయన చెప్పారు. భావోద్వేగాలనే కాకుండా వాస్తవాలను, చరిత్రను కూడా అధ్యయనం చేయాలని తాను శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని విద్రోహంగా పాటించడం హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును అవమానించడమేనని ఆయన అన్నారు. రాష్ట్రావతరణ కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని, అందుకు బూర్గులను కొనియాడాలని ఆయన అన్నారు. బతుకమ్మ ఒక ప్రాంతానికి చెందిన పండుగ కాదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారని, అటువంటి పండుగను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరి కాదని ఆయన అన్నారు.
భూకంపం సృష్టిస్తామన్నవాళ్లు శాంతి మార్గంలో లక్ష్య సాధనకు కృషి చేయడానికి ముందుకు రావడం హర్షనీయమని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. కెసిఆర్ తో వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, కెసిఆర్, తవని అభిప్రాయాలు వేర్వేరని, తన అభిప్రాయాలను మాత్రమే కెసిఆర్ అభినందించారని ఆయన చెప్పారు. గద్దర్ ప్రజా ఫ్రంట్ గురించి ఇప్పుడు మాట్లాడితే అపోహలకు దారి తీస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications