జూనియర్ కళాశాలలో విద్యార్థినిని వేధించిన లెక్చరర్

ఉమాదేవి చదువులో వెనుకబడి ఉంటుంది. తోటి విద్యార్థుల ముందు ఆమెను లెక్చరర్ గోపాలకృష్ణ నిరంతరం వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నువ్వు బ్రతకడం వేస్టు అని, ఎందుకు పనికి రావని, నీ జీవితం దండుగ అని పలుమార్లు లెక్చరర్ అందరి ముందు కామెంట్ చేయటంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పూనుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉమాదేవి మాకు లెక్చరర్ విషయం చెప్పిందని, లెక్చరర్ తో కూడా మాట్లాడుతామని చెప్పామని అయితే ఇంతలోనే తన కూతురు ఇలా చేస్తుందని ఊహించలేదని తల్లిదండ్రులు అంటున్నారు.












Click it and Unblock the Notifications