వైయస్ జగన్ సిఎం కావాలంటూ చెవిరెడ్డి కోటి సంతకాల సేకరణ
State
oi-Srinivas G
By Srinivas
తిరుపతి: మాజీ తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పటికే సుమారు ఒక లక్షకు పైగా సంతకాలు చేయించాడు. వారందరికీ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి కలిగే లాభాలను వివరిస్తూ సంతకాలు చేయిస్తున్నాడు. జగన్ వర్గీయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానాన్ని కాదని జగన్ కు అనుకూలంగా నిత్యం వార్తలో ఉంటూనే ఉన్నాడు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ముందుకు తెస్తూ కోటి సంతకాలు చేపట్టడంతో జగన్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.