రాయపాటిపై కోటి రూపాయలకు కన్నా లక్ష్మినారాయణ పరువు నష్టం దావా

నష్టపరిహారంతో పాటు రాయపాటి ఇకపై ఆరోపణలు చేయకుండా శాశ్వత ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇప్పించాలని కూడా పిటిషన్‌లో కోరారు. సీనియర్ న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డితో మంగళవారం జిల్లా కోర్టులో దావా వేశారు. కోర్టు ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించారు. మంత్రి కన్నాను మధు కోడాతో పోలుస్తూ ఎంపీ రాయపాటి అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 21న తన న్యాయవాదితో రాయపాటికి లీగల్ నోటీస్ జారీ చేశారు. అయితే, మూడు నెలలు గడచినా దానిపై రాయపాటి స్పందించలేదు. రోశయ్య మంత్రివర్గంలో అవినీతిపరులున్నారని, వారిని తొలగించకపోతే పార్టీకి భవిష్యత్తులో పరాజయం తప్పదని ధ్వజమెత్తారు. దీంతో మంత్రి కన్నా పరువు నష్టం దావా దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications