ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు 20 రోజుల గడువే: కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సీమాంధ్ర నాయకులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అడ్డుపడుతున్నది తెలుగుదేశం పార్టీయే అని ఆయన అన్నారు. పదేళ్ల కింద తాను చెప్పినట్లే తెలంగాణవాదులంతా ఒక్క దిక్కు వస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇచ్చేవారు, తెచ్చేవారు ఎవరూ లేరని, ప్రజలే తెలంగాణను తెచ్చుకుంటారని ఆయన అన్నారు. వచ్చే నెల 9వ తేదీన వరంగల్ లో జరిగే బహిరంగ సభ ద్వారా కేంద్రానికి తెలంగాణపై ఓ హెచ్చరిక పంపుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications