ఆయన స్థాయి ఎంత: చంద్రబాబుపై ముఖ్యమంత్రి రోశయ్య రుసరుస
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తనకు పోయిన పరపతిని కాపాడుకోవడానికే విమర్శలు చేయాలను చూస్తున్నాడని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విమర్శించారు. రాష్ట్రంలో తనకు ఏ మాత్రం పలుకుబడి లేదని తెలుసుకొని చంద్రబాబు ఎవరిపైన పడితే వారిపైన విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇన్నాళ్లు తనపైన విమర్శలు చేస్తే సహించానని ఆయన అన్నారు. అయితే దేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ పైన విమర్శలు చేయడానికి ఆయన స్థాయి ఎంత అని రోశయ్య ప్రశ్నించారు.