న్యూఢిల్లీ: సత్యం రామలింగరాజు బెయిలు పిటీషన్ కేసును సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సత్యం రామలింగరాజు తనకు బెయిలు కావాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు సరేనంది. దానిని సిబిఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. అయితే ఆ కేసును బుధవారం విచారించిన సుప్రీం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అంతకుముందు సత్యం రామలింగరాజుకు సుప్రీం కోర్టు ఆల్టిమేటం జారీ చేసింది. నీకు బెయిలు ఎందుకు ఇవ్వాలో చెప్పాలని సత్యం రామలింగరాజును సుప్రీంకోర్టు కోరింది. అందుకు సత్యం రామలింగరాజు కోర్టులో కారణాలు చూపించాడు. అయితే వాదనలు, ప్రతివాదనలు విన్న జడ్జి కేసును వాయిదా వేశారు.