కర్నూలు: కర్నూలు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే హత్య చేసిన దారుణ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. జిల్లాలోని ప్యాపిలి మండలం హుస్సేన్ పురలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్తి కోసం తండ్రిని కొడుకే హతమార్చడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యగానించపడ్డ తండ్రిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా హత్య చేసిన కొడుకు పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.