సీమాంధ్ర నాయకులకు కెసిఆర్ పై ప్రేమ పెరుగుతుంది: శ్రీనివాస్

Srinivas
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కు తెలంగాణపై చిత్తశుద్ది లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పై సీమాంధ్ర నాయకులకు ఈ మధ్య ప్రేమ ఎక్కువయి పోతుందని ఆయన అన్నారు. కేసిఆర్ లాంటి వారు తనకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరం లేదని ఆయన సూచించారు. చిత్తశుద్ధి లేనివారు తనకు సర్టిఫికేట్ ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు.

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కూడా డి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎఐసిసి అధికార ప్రతినిధి రాహుల్ గాంధీని, ప్రధాని మన్మోహన్ ను విమర్శిస్తే కాంగ్రెసు చూస్తూ కూర్చోదన్నారు. విమర్శించే అర్హత లేదన్నారు. రాహుల్ అతి చిన్న వయసులో ప్రజల మధ్య తిరుగుతూ కాంగ్రెసు అభివృద్ధికి తోడ్పడుతూ వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నాడన్నారు. అది జీర్ణించుకోలేకనే చంద్రబాబు రాహుల్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. చిన్నవాడైనప్పటికీ రాహుల్ గాంధీని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.

సూక్ష్మ రుణ సంస్థలను తీసుకు వచ్చింది చంద్రబాబే అని అన్నారు. వాటి ఆగడాలను అరికట్టడానికే కాంగ్రెసు ప్రభుత్వం పావలా వడ్డీని ప్రవేశపెట్టిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు తన స్థాయిని దిగజారి మాట్లాడటం మానుకోవాలన్నారు. ఎన్నికల్లో నేను పోటీ చేయాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, అది నాపై ఆధారపడి లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+