ఓబామా సామర్థ్యంపై 73 శాతం ఇండియన్లకు నమ్మకం

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు 87 శాతం మంది భారతీయులు ఓటేశారు. సోనియా గాంధీకి కూడా 87 శాతం మంది ఓటేశారు. రాహుల్ గాంధీ పట్ల 85 శాతం మంది సానుకూల వైఖరి వ్యక్తం చేశారు. అమెరికా పట్ల భారతదేశంలో ఎంతో సానుకూల వైఖరి ఉందని రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. అమెరికా పట్ల 66 శాతం మంది సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు తెలిపింది. అయితే నిరుటి కన్నా అది తక్కువేనని తేల్చింది. నిరుడు 76 శాతం మంది సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. రష్యా పట్ల 51 శాతం మంది సానుకూల దృక్పతం కలిగి ఉన్నట్లు తెలిపింది. యూరోపియన్ యూనియన్ పట్ల 36 శాతం మంది, చైనా పట్ల 34 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరితో ఉన్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications