వర్మ రక్త చరిత్రపై మాజీ నక్సలైట్ భార్య భూలక్ష్మి ఆగ్రహం

కాగా అనంతపురం ఎస్పీ ఎం.కె.సింగ్ సినిమాను సినిమాలాగే చూడాలి. కాని దానిలో విపరీతార్థాలు వెతకకూడదని జిల్లా ప్రజలకు సూచించారు. రక్త చరిత్ర విడుదలవుతున్న ప్రతి థియేటర్ వద్ద పోలీసులను మోహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. చిత్రాన్ని చూడకుండానే ఆ సినిమాలో ఏముందో తెలియకుండా మాట్లాడటం రెచ్చగొట్టడం మంచి పద్దతి కాదన్నారు.
వర్మపై ఇప్పటికే ప్రజలు, పలు పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి వర్మపై నిప్పులు చెరిగారు. అనంతపురం ఫ్యాక్షన్ జీవితాన్ని మరిచిపోయి చాలాకాలమవుతుందని మళ్లీ వర్మ దాన్ని గుర్తు చేయటం ఆయనకు తగదన్నారు. అయితే చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాబట్టి రేపు చిత్రం చూసిన తర్వాత అనంతపురం, ఫ్యాక్షనిజం గురించి ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర అందోళన నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications