విజయవాడలో వ్యాపారి తనయుడి కిడ్నాప్: రియలా, డ్రామానా?

Vijayawada
విజయవాడ: విజయవాడలో ఓ వ్యాపారి తనయుడు కమలేష్ జైన్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కమలేష్ జైన్ ఈ నెల 14వ తేదీన కిడ్నాపయ్యాడు. కమలేష్ జైన్ అప్పగించడానికి కిడ్నాపర్లు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా కమలేష్ జైన్ ను పట్టుకుని పోలీసులు అతని తండ్రికి అప్పగించారు. కమలేష్ జైన్ ను శుక్రవారం ఉదయం విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు విచారించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే కమలేష్ జైన్ పోలీసులకు చిక్కాడు.

కమలేష్ జైన్ కిడ్నాప్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే కిడ్నాప్ జరిగిందా, కమలేష్ జైన్ కిడ్నాప్ డ్రామా ఆడాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కమలేష్ జైన్ ఓ వ్యవహారంలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను డబ్బుల కోసం కమలేష్ జైన్ కిడ్నాప్ డ్రామా ఆడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+