చంద్రబాబు నాయుడు ఫైర్: రక్త చరిత్రలో ఎన్టీఆర్ సీన్స్ పై దిగొచ్చిన వర్మ

చిత్రంలోని బుక్కారెడ్డి ఓబుల్ రెడ్డి కాడని, శివాజీ రావు ఎన్టీఆర్ కాడని, తనకు ఓబుల్ రెడ్డి ఎవరో కూడా తెలియదని వర్మ బుకాయిస్తూ వచ్చాడు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చిత్ర కథ పూర్తిగా కల్పితమని చెప్పాడు. అయితే, తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వర్మ మెట్టు దిగారు. దృశ్యాలను తొలగించి సినిమా కంటిన్యుటీ దెబ్బ తినకుండా చూస్తామని వర్మ చెప్పారు. నిర్మాత సి. కళ్యాణ్ కూడా దిగొచ్చారు. క్రికెట్ ఆడుతూ ఔట్ అనే దృశ్యం, బాంబు దాడి దగ్గర వాయిస్ ఓవర్‌లో వచ్చే వ్యాఖ్యలు, ఆయుధాలన్నీ విడిచిపెట్టినప్పుడు ఉండే డైలాగ్‌లను తీసేస్తున్నామని కళ్యాణ్ చెప్పారు. మేం సినిమాలా చూశామని, శనివారం నుంచే వాటిని తొలగిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications