మెక్సికో సిటీ: మెక్సికోలోని ఓ ఇంట్లో జరుపుకుంటున్న వేడుకలలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో 13 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్యూడడ్ జ్యురెజ్ పట్టణంలోని ఓ ఇంట్లో జరుగుతున్న వేడుకలో కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మరణించిన వారంతా 20 ఏళ్ల లోపువారే కావటం విషాదం. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఆ సమయంలో ఓ ఇంట్లో కొంతమంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు కొందరు దుండగులు వ్యానుల్లో వచ్చి వీరిపై కాల్పులు జరిపారని అక్కడున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.