ప్రజలు వైఎస్ ను మరిచిపోలేక పోతున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్:మహబూబ్ నగర్‌లో త్యాగధనుల సభ రసాభసాగా మారడానికి కారణం వీహెచ్ వ్యాఖ్యలేనని కాంగ్రెస్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలు కావాలో.. వీహెచ్ లాంటి నాయకులు కావాలో అధిష్టానమే తేల్చుకోవాలని బాజిరెడ్డి సూచించారు. ఇకనైనా వీహెచ్, కేకేలను దూరం పెట్టి త్యాగధనుల సభలను నిర్వహించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. సభలో వైఎస్ ఫోటోలేదని ప్రశ్నించినంత మాత్రాన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంతరావు వీధిరౌడిలా ప్రవర్తించారన్నారు. ఒక్క మహబూబ్‌నగర్‌లోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిచిపోలేకపోతున్నారని ఆయన అన్నారు.