హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేక్ ఒబేరాయ్ అనంతపురం పర్యటన రేపటికి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vivek and Ramu
హైదరాబాద్:బాలీవుడ్ నటుడు, రక్త చరిత్ర హీరో వివేక్ ఓబెరాయ్ అనంతపురం పర్యటన వాయిదా పడింది. వెంకటాపూర్‌లోని పరిటాల రవి సమాధిని ఆదివారం ఆయన సందర్శించవలసి ఉంది. పరిటాల రవి సమాది దగ్గర పరిటాల రవి భార్య సునీత తో కలిసి ఆయన నివాళులర్పించేందుకు రానున్నారు. రక్త చరిత్ర చిత్ర దర్శకుడు రాంగోపాల్‌వర్మ, హీరో వివేక్ ఒబెరాయ్‌లు అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వివేక్ పర్యటన సోమవారానికి వాయిదా పడింది.

ఈ విషయాన్ని వివేక్ ఒబేరాయ్ పరిటాల సునీతకు కబురు చేశాడు. కొన్ని కారణాల వల్ల తాను ఆదివారం రాలేక పోతున్నానని, సోమవారం వస్తానని చెప్పినట్టు సమాచారం. రక్త చరిత్ర చిత్రం విజయం పట్ల వివేక్ ఒబేరాయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. వివాదాలను పక్కన పెడితే రాంగోపాల్ వర్మ కూడా చిత్రం విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X