చంద్రబాబు నాయుడు రెండు నాల్కల తెలంగాణ వైఖరిపై జీవన్ రెడ్డి ఫైర్

రెండు నాలుకల ధోరణితో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడన్నారు. సీమాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లు అంటూ ప్రజలను ఏమార్చాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగా తెలంగాణకు వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే అయన వ్యక్తిగతంగా తెలంగాణకు వ్యతిరేకి అయినప్పటికీ అధిష్టానం మాటలను ఎప్పుడూ ఉల్లంఘించలేదని అన్నారు. తెలంగాణపైన అయినా మరే విషయంపైన అయినా అధిష్టానం చెప్పినట్లు నడుచుకునే వారని చెప్పారు.












Click it and Unblock the Notifications