బెజవాడలో బాలుడి దారుణ హత్య: ప్రార్థనామందిరం తగాదాలే కారణం?

సోమవారం పాఠశాలలో బ్రేక్ సమయం వరకు ఉన్న అలీ ఆ తరువాత కనిపించలేదని పాఠశాల ప్రధానోపాద్యాయుడు చెబుతున్నారు. దీంతో అలీ కిడ్నాప్ కు గురయినట్లు తల్లిదండ్రులు భావించారు. అలీ తండ్రి స్థానిక మసీదులో అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. మసీదు కార్యవర్గ కమిటీలో విభేదాలే అలీ మృతికి కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అలీ తండ్రిని అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అలీ కిడ్నాప్ చేసి, హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి తగాదాలు కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. అలీ మృతదేహం దగ్గర సైకిల్ పడి ఉంది. బాలుడు సైకిల్ పై 12 కిలోమీటర్ల దూరం రాలేడు. కాబట్టి ఎవరో ఇతరులు సైకిల్ పై తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications