హీరో రాజశేఖర్, జీవిత దంపతులపై అల్లు అరవింద్ ఫైర్

ఎంతో మందికి ప్రాణాలు పోసిన బ్లడ్ బ్యాంక్ విశేషమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి పెట్టిందని, సామాజిక ప్రయోజనం నెరవేర్చే కార్యక్రమాలపై చిన్న ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని విచారణ చేయించాల్సిందిగా తాను ప్రభుత్వాన్ని కోరారని, ప్రభుత్వం ముందుకు వచ్చి ఓ స్వయం ప్రతిపత్తి గల సంస్థతో విచారణ చేయించిందని, అందులో ఏ విధమైన అక్రమాలు లేవని విచారణ తేల్చిందని ఆయన వివరించారు. దాని వల్ల కొత్త ప్రయోజనం నెరవేరిందని ఆయన అన్నారు. అర్థం లేని ఆరోపణల వల్ల విస్తృతమైన ప్రయోజనాలు ఆశించి ముందుకు వచ్చిన కార్యక్రమాలు దెబ్బ తింటాయని, అవి సమాజానికి మంచివి కావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications