రగులుతున్న రాష్ట్రావతరణ దినం నవంబర్ 1: విద్యార్థులు నిరాహార దీక్ష

ఓయు విద్యార్థులపై ప్రభుత్వం ద్వందనీతిని ప్రవర్తిస్తుందని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు, ఎన్నో సంఘాలు సచివాలయాన్ని ముట్టడించాయన్నారు. వారిపై లేని కేసులు విద్యార్థులపై పెట్టడమేమిటన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివైయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులనే పోలీసులు, ప్రభుత్వం జులుం చూపిస్తుందన్నారు. న్యాయంగా తెలంగాణ కోసం పోరాడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం వెనుక ఆంధ్ర ఆధిపత్యం కనిపిస్తుందని ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై దుర్మర్గంగా ప్రవర్తిస్తుందని రాజారాం యాదవ్ అన్నారు. నవంబర్ 1కి నిరసనగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు.
అంతకుముందు సచివాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. సచివాలయం మెయిన్ గేటు ఎక్కి సచివాలయంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ విద్యార్ధులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. నవంబర్ 1ను తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన అవతరణ దినోత్సవాన్ని రద్దు చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతవరకు వెనక్కి తగ్గేది లేదన్నారు.












Click it and Unblock the Notifications