కింగ్ ఫిషర్ విమానంలో సహ ప్రయాణికులతో నటి అనుష్క గొడవ

రణవీర్, అనుష్క కింగ్ ఫిషర్ విమానంలో ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నారని, అనుష్క పక్కన కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు ఆమె ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించారని, దానికి ఆమె అభ్యంతరం చెప్పారని, దాంతో గొడవ జరిగిందని కింగ్ ఫిషర్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో దిగిన తర్వాత టెర్మినల్ వరకు తమకు వేరే వాహనాలు ఇవ్వాలని ఆ ఇద్దరు ప్రయాణికులు అడిగారని, సిబ్బంది అందుకు అంగీకరించి వేరే వాహనం ఏర్పాటు చేశారని, అయితే రణవీర్ ఆ వాహనంలోకి దూసుకెళ్లి వారితో గొడవకు దిగారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications