కళ్లుపోయిన అభిమానిని ఆదుకోని మెగాస్టార్ చిరంజీవి

గుర్రప్ప చిన్నప్పటినుండి చిరంజీవికి పెద్ద అభిమాని. చిరంజీవి చిత్రం విడుదలకు ముందు, విడుదల రోజు గుర్రప్పది హడావుడే. చిరంజీవి నటించిన చిత్రం విడుదలకు ముందు ఆయన ప్రతి చిత్రానికి గుర్రప్ప కటౌట్లు కట్టాల్సిందే. తన పనులు మానుకొని మరీ కటౌట్లు కోసం థియేటర్ కు వెళ్లేవాడు. ఇక చిత్రం విడుదలయ్యే రోజు థియేటర్ కు వెళ్లి బాణాసంచా పేల్చి మొదటి ఆట చూసేవాడు. గుర్రప్ప చిరంజీవి ఇంద్ర చిత్రానికీ ఎప్పటి మాదిరే కటౌట్లు కట్టాడు. అయితే చిత్రం విడుదల రోజు బాణసంచా పేల్చుతుంటే ఆయన కళ్లలో పడి కళ్లు పోయాయి.
అయితే గుర్రప్ప చిరంజీవి తనకు తప్పకుండా సహాయం చేస్తాడని భావించాడు. ఓసారి చిరంజీవిని కలిసి తన పరిస్థితిని వివరించాడు. రోజు పని చేస్తేగాని గడవని పరిస్థితిని వివరించాడు. అది విని చిరంజీవి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ మాట రాజకీయ హామీగానే నిలిపిపోయింది. సహాయం చేస్తానన్న చిరంజీవి చుట్టూ చాలాసార్లు తిరిగాడు. అయితే అన్నిసార్లు తిరిగిగాక కానీ ఆయనకు అర్ధమైంది. చిరంజీవి తనకు సహాయం చేయడని. ప్రస్తుతానికి గుర్రప్ప భార్య కూలీ పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పటికైనా చిరంజీవి సహాయం చేయాల్సిందిగా ఆయన ఆ ఛానల్లో కోరాడు. అందరి ముందుకు వచ్చాకనైనా చిరంజీవి సహాయం చేస్తాడని భావిద్దాం. గుర్రప్ప చిరు అభిమానులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాడు. మీరు అభిమానించండి. కాని అభిమానంతో జీవితాలు నాశనం చేసుకోకండి అని.












Click it and Unblock the Notifications